న్యూఢిల్లీ: 15వ లోక్ సభ డిప్యూటి స్పీకర్ గా కరియాముండా పేరును బీజేపీ ప్రతిపాదించింది. మంగళవారం ప్రతిపక్షనేత అద్వానీ ఆధ్వర్యంలో సమావేశం అయిన అనంతరం ఉప సభాపతిగా జార్ఖండ్ గిరిజన ప్రాంతానికి చెందిన ముండాను ఎంపిక చేశారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవికి సభ్యుడిని ఎన్నుకోవాలని యూపీఏ సర్కారు ప్రతిపక్ష భాజాపాకు సూచించడంతో ఆ పార్టీ కరయాముండాను ఎన్నుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలియచేసారు.