కారు ప్రమాదంలో 4 గురు మృతి
మహబూబ్ నగర్: జిల్లాలోని కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు బుధవారం ఉదయం గుర్తుతెలియని వాహనం మారుతీ వ్యాన్ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులంతా అనంతపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియవలసి ఉంది.












Click it and Unblock the Notifications