హైదరాబాదు: అధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ సారి తెలంగాణపై తప్పకుండా తీర్మానం చేయాలని ఆపార్టీ ఎమ్మెల్యే టీఆర్ ఎస్ శాసన సభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలన్నారు. స్పీకరుగా ఎన్నికవుతున్న కిరణ్‌కుమార్ రెడ్డి కరుడు గట్టిన సమైక్య వాధి అన్ని అలాంటి వ్యక్తిని స్పీకరు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన కిరణ్ కుమారెడ్డికి స్పీకర్ పదవి ఇవ్వడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.