న్యూఢిల్లీ: ఒక మహిళ లోక్ సభ స్పీకరుగా ఎన్నికవడాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. కొత్త స్పీకర్ మీరాకుమార్ దేశప్రతిష్టను ఇనుమడింపజేస్తారని, సభను సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రధాని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానితోపాటు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, బీజేపీ నేత ఎల్ కే అద్వాని మీరాకుమార్‌కు అభినందనలు తెలిపారు.