చిరంజీవికి 'మసాల' సెగ
హైదరాబాదు: ప్రజారాజ్యం అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతుండగా ఆ పార్టీనుంచి బయటికి వెళ్ళిన మసాల ఈరన్న తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చిరంజీవికి, ప్రజారాజ్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిన మసాలను పోలీసులు అడ్డుకున్నారు. మసాల ఈరన్న గతంలో తెలుగుదేశం నాయకుడు. వినూత్న పద్ధతిలో నిరసనలు తెలుపడంలో ఆయన నిష్ణాతుడు.












Click it and Unblock the Notifications