న్యూఢిల్లీ: బుధవారం ఉదయం రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో దేశానికి చారిత్రక క్షణాలు చోటు చేసుకున్నాయి. లోకసభ తొలి మహిళా స్పీకరుగా మీరాకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా ఎన్నికను లోకసభ సభ్యులు మూజు వాణి ఓటుతో ఆమోదించారు. అన్ని పార్టీలు ఆమె అభర్థిత్వానికి మద్దతిస్తూ నామినేషన్లు దాఖలు చేయడంతో బుధవారం స్పీకరుగా మీరా ఎన్నిక లాంఛనప్రాయమైంది.