న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితం కానున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎన్ డి తివారీ స్ధానంలో కేంద్ర మాజీ మంత్రి హెచ్ ఆర్ భరద్వాజ్ ను కొత్త గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్ లను కేంద్రం నియమించనుంది. రాజస్థాన్ గవర్నర్ గా టీవీ రాజేందర్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఎస్ కే సింగ్ ల నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.