హైదరాబాద్: హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సమావేశమయ్యారు. దేశ చరిత్రలోనే తొలిసారి హోం మంత్రి పదవిని చేపట్టిన మహిళగా సబితా ఇంద్రారెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు తెలుపగా, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవికి సబిత ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత శాసనసభకు చెందిన పలు అంశాలపై వీరురువురు పిచ్చాపాటీగా మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రమాణ స్వీకారానంతరం సిపిఐ నేతలు వైఎస్‌ను కలిశారు. పోలీసులు అరెస్టు చేసిన విరసం నేత క్రాంతి, రైతు కూలీ సంఘం నాయకుడు రమేష్ ను విడుదల చేయాలని వారు కోరగా ఇందుకు వైఎస్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.