జులై 1 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్
హైదరాబాద్: జూలై1 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఈసారి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. జూలై నెలాఖరులోగా కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించకుండా ముందుగానే ర్యాంకులు ప్రకటించే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications