వైయస్ కు ఆటా అధ్యక్షుడి శుభాకాంక్షలు
హైదరాబాద్: ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు ఎం.జితేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, కిషన్ రెడ్డిలను కూడా ఆయన అభినందించారు.
మహిళను హోంమంత్రిగా నియమించడం చారిత్రాత్మకమని, గౌరవప్రదమని ఆయన అభిప్రాయపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి కావడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన అన్నారు. ఎన్నారైలకు, రాష్ట్ర మంత్రి వర్గానికి మధ్య తాము సన్నిహిత సంబంధాలను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications