విజయవాడ జైల్లోనే సత్యంబాబు
విజయవాడ: విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు ఈ నెల 22కి వాయిదా పడింది. సత్యంబాబు ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగు పడినందున విజయవాడ జిల్లా కోర్టులో హాజరుపరచాలని మహిళా సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి గురువారం రాత్రి విజయవాడకు తరలించిన సత్యంబాబును విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు.
తనకు ఇక్కడ సరైన చికిత్స జరగదని చెబుతూ హైదరాబాద్ కు తరలించాలని సత్యంబాబు న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు నివేదిక ఇచ్చారని, అతన్ని విజయవాడలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. వైద్య సౌకర్యాలు కల్పించాలని పోలీసుల్ని ఆదేశించింది. తన కుమారిడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎప్పటికైనా నిర్దోషిగా బయటకు వస్తాడని సత్యంబాబు తల్లి మరియమ్మ అన్నారు. కాగా సత్యంబాబుకు నిమ్స్ లోనే చికిత్స అందించాలని కోర్టులో పిటిషన్ వేస్తామని అతని తరఫు న్యాయవాది తెలిపారు.












Click it and Unblock the Notifications