భట్టి విక్రమార్క ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గా ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యుడు మల్లు భట్టివిక్రమార్కను నియమించారు. విప్‌ లుగా శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్‌, అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే ఎస్‌.శైలజానాథ్‌ ను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పదవుల తర్వాత కీలకమైన మూడు విప్‌ లను ఎస్సీ వర్గానికే కేటాయించడం గమనార్హం. మంత్రి పదవులు దక్కని కర్నూలు జిల్లా సీనియర్‌ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు చీఫ్ విప్ పదవి కోసం ప్రముఖంగా వినిపించాయి. ఆ ఊహలను తలకిందులు చేస్తూ తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లు భట్టివిక్రమార్కకు అవకాశం దక్కింది. ఈయన ఎమ్మెల్సీగా రెండేళ్లు వ్యవహరించారు.

ఖమ్మం జిల్లాలో సీపీఎంను దెబ్బతీసి కాంగ్రెస్‌ కు లబ్ధి చేకూర్చే ప్రక్రియలో మల్లు భట్టివిక్రమార్క క్రియాశీలకంగా వ్యవహరించారని పార్టీ నమ్ముతోంది. అంతేకాక గతంలో తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ తెలంగాణ సీనియర్లు ఢిల్లీకి వెళ్లినపుడు, మల్లు భట్టివిక్రమార్క మరికొందరు వెళ్లి వారికి వ్యతిరేకంగా అభివృద్ధి వాదాన్ని వినిపించారు. ప్రస్తుత తెలంగాణ వద్దని, అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలని గళం విన్పించారు. ఇది కూడా ఆయనకు అనుకూలించింది. భట్టి సోదరుడు, సీనియర్‌ నాయకుడు మల్లురవి ఈ సారి జడ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చీఫ్‌విప్‌ పదవి మల్లు భట్టి విక్రమార్కకు దక్కింది. గతంలో మల్లురవి విప్‌గా వ్యవహరించారు.రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురే ఎస్సీలకు స్థానం లభించింది. శాసనసభకు రెండో సారి ఎన్నికైన వారిలో శైలజానాథ్‌, కొండ్రుమురళీమోహన్‌ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+