నాగసాకిపై బాంబు వేసిన పైలట్ మృతి
లండన్: జపాన్ లోని నాగసాకిలో అణుబాంబు వేసిన యుద్ధ విమానం కో పైలట్ మరణించాడు. 88 ఏళ్ల వయస్సు గల అతను హృదయ సంబంధమైన సమస్య తలెత్తి మృతి చెందాడు. చార్లెస్ డోనాల్డ్ ఆల్బరీ మే 23వ తేదీన మరణించినట్లు టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1945 ఆగస్టు 9వ తేదీన నాగసాకిలో అణుబాంబు వేశారు.
హీరోషిమా విధ్వంస తీవ్రతను కూడా అతను కనిపెట్టాడు.హీరోషిమాలో బాంబు విధ్వంస తీవ్రతను, రేడియో ధార్మిక శక్తి స్థాయిని కొలవడానికి అవసరమైన సామగ్రిని విమానం నుంచి పడవేశారు. ఆ బృందానికి కల్నల్ పాల్ టిబెట్స్ జూనియర్ నేతృత్వం వహించాడు. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది. ఆ యుద్ధం తర్వాత అల్బరీ ఫ్లోరిడాలోని కోరల్ గాబిల్స్ లో భార్యతో పాటు స్థిరపడ్డాడు. ఎస్టీమ్ ఎయిర్ లైన్స్ విమానాలను నడుపుతూ జీవనం సాగించాడు.












Click it and Unblock the Notifications