అనంత జిల్లాలో ఇద్దరి హత్య
అనంతపురం: అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరిని దారుణంగా హత్యచేశారు. బొమ్మనహాల్ లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు టిప్పర్ డ్రైవర్, క్లీనర్ ను హత్య చేసి అనంతరం టిప్పర్ తో ఉడాయించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications