అవినీతి పై సీఎం పోరాటం
హైదరాబాద్: అవినీతి అంతానికి నడుం బిగించాలని సీఎం వైఎస్ రాజశేరరెడ్డి పిలుపునిచ్చారు. అవినీతిపై పోరాటం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అవినీతి అంతానికి మూడంచెల విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఇందుకోసం అన్ని శాఖల్లో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.ఏసీబీ డీజీపీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. అవినీతి అంతమందిచడంలో మనమే నంబర్‌వన్‌లో ఉన్నామని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications