లగడపాటి చిన్నిల్లు గొడవ
హైదరాబాద్ : విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ కు రెండవ పెళ్ళి జరిగిందని, వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన న్యాయవాది సుంకర కృష్ణమూర్తి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ)కు ఫిర్యాదు చేశారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి రెండవ సారి ఎంపిగా గెలుపొందిన లగడపాటి రాజగోపాల్ నామినేషన్ పత్రంలో తప్పుడు వివరాలు పొందుపరచినందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం (ఆర్ పిఎ) కింద ఆయన ఎన్నిక చెల్లదని కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. వెంటనే లగడపాటి ఎన్నికను రద్దు చేయాలని ఆయన కోరారు.
కృష్ణమూర్తి ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించిన వినతిపత్రంలో లగడపాటి రెండవ వివాహానికి, ఆ దంపతులకు పుత్ర జననానికి సంబంధించిన ఆధారాలను కూడా జతపరిచారు. ఎన్నికలలో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన అఫిడవిట్ లో నాలుగవ డిపెండెంట్ గా మూడవ కుమారుడు హర్మన్ పేరును ప్రస్తావించారు.
వాస్తవానికి విజయవాడ ఎంపి లగడపాటి జానకి ఎల్ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారిద్దరికీ జన్మించిన పుత్రుడే హర్మన్ లగడపాటి అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. లగడపాటి, జానకి దండలు వేసుకున్న ఫోటోను కూడా ఆయన జతపరిచారు. వారిద్దరికీ జన్మించిన హర్మన్ లగడపాటి అనే పుత్రునికి సంబంధించిన జనన నిర్థారణ పత్రాన్ని కూడా ఆయన జతపరిచారు.
ఇది 1952 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 146 (సి)ను ఉల్లంఘించినట్లు అవుతున్నదని ఆయన పేర్కొన్నారు. లగడపాటి నిజాలను దాచి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. భారతీయ శిక్షా స్మృతి కింద, వివిధ చట్టాల ఆధారంగా లగడపాటి రాజగోపాల్ ను శిక్షించాలని కృష్ణమూర్తి కోరారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications