"సర్" ఫారం పూర్తి చేశారా? ఒక్క రోజే సమయం- మిస్ అయితే..!!

ఏపీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తుది దశకు చేరింది. రేపు (మంగళవారం)తో ఫారం సమర్పించే గడువు ముగియనుంది. సర్ ప్రక్రియ ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. క్రమేణా అవగాహన పెరగటంతో ప్రక్రియ వేగం పెరిగింది. ఇక.. సమయం ముగుస్తున్న వేళ ఓటర్ల తమ వివరాలు నమోదు చేసి సిబ్బందికి తిరిగి అందిస్తున్నారు. సర్ పూర్తయినా ఓట్ల నమోదు కు అవకాశం ఉందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సర్ ప్రక్రియ దరఖాస్తులు సమర్పించేందుకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో, పత్రాల డిజిటలైజేషన్‌ వేగంగా సాగుతోంది. ఇదే సమయంలో తమ ఓటు డిజిటలైజేషన్‌ అయిందో లేదో తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నం చేస్తున్నారు. తమ ఫారం డిజిటైజేషన్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఓటర్లు ఈ లింక్ https://voters.eci.gov.in/ enumerationformnew క్లిక్ చేయటం ద్వారా తెలుసుకునే వెసులు బాటు కల్పించారు. ఈ లింకు లోపలకు వెళ్లటం తోనే ఈపీఐనెట్‌ వారి సిటిజన్‌ సర్వీస్‌ పోర్టల్‌ కనిపిస్తుంది. ముందుగా లాగిన్ చేయడం కోసం సెల్​ఫోన్ నంబర్ నమోదు చేసి కోరిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వచ్చిన తర్వాత "ఫిల్‌ ఎన్యూమరేషన్‌ ఫారం" పై క్లిక్‌ చేయాలి. ఇక్కడ మరో సారి మొబైల్ నంబర్, క్యాప్చా ఫిల్ చేసి క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది.

sir-house-to-house-enumeration-for-voter-roll-revision-concludes-on-july-14-in-telugu-states-here-t

సర్ ప్రక్రియ పూర్తయినా

దీంతో రాష్ట్రం, ఓటరు కార్డు నంబరు ఎంటర్ చేసి 'సెర్చ్‌' క్లిక్‌ చేయటం ద్వారా మీ ఓటుకు సంబంధించిన వివరాలు డిజిటలైజేషన్‌ అయిందా లేదా అనేది వివరాలు డిస్ ప్లే అవుతాయి. కాగా.. సర్ ప్రక్రియ పూర్తయితే కొత్త ఓటర్లకు అవకాశం ఉంటుందా లేదా అనేది చాలా మందిలో సందేహం గా మారుతోంది. దీని పైన అధికారులు స్పష్టత ఇస్తున్నారు. సర్‌లో నమోదు కాకపోయినా తర్వాత దరఖాస్తు చేసి ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవచ్చు. బీఎల్‌వోలు, ఎన్నికల అధికారులు దరఖాస్తు, పత్రాలను పరిశీలించి అర్హతను నిర్ధారించిన తర్వాత దరఖాస్తుదారుడి పేరును ఓటర్ల జాబితాలో చేరుస్తారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికీ అవకాశం ఉంటుంది. సర్ పూర్తయినా.. సంబంధిత బీఎల్‌వోకు దరఖాస్తు అందజేయొచ్చు. లేదంటే ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో సమర్పించాలి. స్వయంగా వెళ్లలేకపోతే ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘం పోర్టల్‌/యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటరుగా నమోదు కావాలంటే ఫారం-6 సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+