తెలంగాణ TET-2026 ఫలితాలు వచ్చేశాయ్..!

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష TG TET 2026 ఫలితాలు లేటెస్ట్ గా విడుదలయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠకు తెరదించాయి. ఈసారి నిర్వహించిన టెట్ పరీక్షల్లో మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మహిళా అభ్యర్థులు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకుంటూ పురుషుల కంటే.. అధిక సంఖ్యలో క్వాలిఫై కావడం విశేషంగా నిలిచింది.

ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET-2026) కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,15,028 మంది పరీక్షలకు హాజరుకాగా, మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 43.94 శాతంగా నమోదైంది. కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

telangana-tet-2026-results-are-out-and-process-to-checking-the-information-and-other-details

ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈసారి భారీ సంఖ్యలో ఇన్-సర్వీస్ టీచర్లు కూడా పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 23,623 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్ష రాయగా, వారిలో 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో కూడా టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.

అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక TG TET పోర్టల్‌లో హాల్ టికెట్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మార్కుల మెమో, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈసారి ఫలితాల్లో మహిళలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అర్హత సాధించిన వారిలో 32,970 మంది మహిళలు ఉండగా, 17,568 మంది పురుషులు, ఆరుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు టెట్‌లో ఉత్తీర్ణులయ్యారు.

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు నిర్వహించిన పేపర్-1లో 65.29 శాతం మంది అర్హత సాధించి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అయితే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించే పేపర్-2లో పోటీ తీవ్రంగా కనిపించింది. ఇందులో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 40.76 శాతం మంది మాత్రమే అర్హత సాధించగా, సోషల్ స్టడీస్ విభాగంలో కేవలం 25.79 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+