హైదరాబాద్: కేసీఆర్‌పై టీఆర్ ఎస్ పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ వైఫల్యం చెందడానికి గల కారణాలను విశ్లేషించకుండా, కనీసం నాయకులకు కూడా అందుబాటులో లేకుండా ఢిల్లీలో దాక్కోవటమేంటని మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. సీనియర్ పార్టీ నాయకులు బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరారు. కేసీఆర్‌పై తిరుగబాటు బావుటా ఎగరవేస్తున్నట్లు ప్రకటించారు.మరోపక్క అసంతృప్తులు దాడి చేస్తారని అనుమానంతో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.