ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసు బయట పడింది.హైదరాబాదులో కూడా మరో స్వైన్ ఫ్లూ కేసు బయటపడింది. దీంతో దేశంలో స్వైన్ ప్లూ బాధితుల సంఖ్య పదికి చేరుకుంది. ఢిల్లీలో 35 ఏళ్ల వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. ఈయన జూన్ 2వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. రెండు రోజుల తర్వాత అతనిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 5వ తేదీన స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన టెకీకి సమీపంగా మెలగడంతో 25 ఏళ్ల వ్యక్తికి హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. వీరిద్దరు కూడా మే31వ తేదీన అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు.












Click it and Unblock the Notifications