భారత విద్యార్థులకు రుడ్ హెచ్చరిక
సిడ్నీ: ఆస్ట్రేలియన్లపై ప్రతీకార దాడులపై ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుడ్ భారత విద్యార్థులకు హెచ్చరికలు చేశారు. భారతీయ విద్యార్థులు గస్తీ బృందాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. ఏ విద్యార్థిపైనా, భారతీయుడిపై గానీ మరొకరిపై గానీ ఎక్కడ దాడి జరిగినా తాము సహించబోమని, అటువంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తాము అంగీకరించబోమని ఆయన అన్నారు.
ఊపిరి తీసుకోవడానికి ప్రతి ఒక్కరికీ కొంత సమయం కావాలని, ప్రశాంత పరిస్థితులను నెలకొల్పుతామని ఆయన చెప్పారు. గత 18 నెలలుగా పెరుగుతున్న వీధి దోపిడీలను అరికట్టడానికి తాము చర్యలు తీసుకుంటున్నామని విక్టోరియన్ చీఫ్ పోలీసు కమిషనర్ సైమన్ ఓవర్లాండ్ చెప్పారు. తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications