కొన్ని దాడులు జాతి వివక్షతోనే: ఆసీస్
మెల్‌బోర్న్: జాతివివక్ష కారణంగా భారతీయులపై దాడులు జరిగాయని ఆస్ట్రేలియా తొలిసారిగా అంగీకరించింది. భారతీయులపై జరుగుతున్న వరుస దాడుల్లో కొన్ని మాత్రం జాతివివక్షతతో చేసినవేనని విక్టోరియా పోలీస్ కమిషనర్ సైమన్ ఒవర్లాండ్ మంగళవారం స్పష్టం చేశారు. జాతివివక్షతతో భారతీయులపై దాడులు జరగడం లేదని తొలుత పేర్కొన్న ఆయన తాజా దాడుల్లో కొన్ని మాత్రం జాతివివక్షత కారణంగా జరిగినవే అని అంగీకరించడం గమనార్హం.
మరోవైపు తమపై ఎక్కడ దాడులు జరుగుతాయోనన్న భయంతో భారతీయులు దక్షిణ సిడ్నీలోని హారీస్ పార్క్ వద్ద సోమవారం రాత్రి ఊరేగింపు జరిపారు. 'సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు హారీస్ పార్క్ ప్రధాన వీధిలో గుమిగూడి ఇటీవల జరిగిన జాతి వివక్ష దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిపారు. వీరిలో కొందరు బేస్‌బాల్ బ్యాట్లు, హాకీ కర్రలు పట్టుకొన్నారు' అని స్కైన్యూస్ టీవీ పేర్కొంది. 20 ఏళ్ల భారతీయ విద్యార్థిపై దాడి జరిగిన అనంతరం సోమవారం రాత్రి ఈ ఊరేగింపు జరిగిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications