న్యూఢిల్లీ: ఎస్ ఎన్సీ లావిలిన్ కేసులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పినరాయి విజయన్ పై సిబిఐ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. విజయన్ ప్రాసిక్యూషన్ కు కేరళ గవర్నర్ ఆర్ఎస్ గవాయి పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో సిబిఐ విజయన్ పై చార్జిషీట్ దాఖలు చేసింది. విజయన్ పై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయడం సిపిఎంను ఇరకాటంలో పెట్టింది.
విజయన్ పై చర్యను నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సిపిఎం నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. పినరాయి విజయన్ కు కుంభకోణంతో సంబంధం ఉందనడానికి తమ వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయని సిబిఐ అంతకు ముందు అన్నది.