తెలంగాణపై వైయస్ మాట ఓకే: గీతారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వల్ల సాధ్యం కాదనే సత్యాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని, తెలంగాణను కాంగ్రెసు అభివృద్ధి చేస్తుందని నమ్మారని, తెలంగాణ కాంగ్రెసు వల్లనే సాధ్యమవుతుందని విశ్వసించారని ఆమె అన్నారు. సాగునీటి ప్రాజెక్టల్లో తెలంగాణకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆమె చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల వంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఆమె చెప్పారు. ప్రజలు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ను, తెరాసను నమ్మలేదని ఎన్నికల ద్వారా తేలిపోయిందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని అడిగితే రాజకీయ చర్చలకు మళ్లిస్తున్నారని ఆమె సమాధానం దాటవేశారు.












Click it and Unblock the Notifications