తిరుపతి: "ఇకపై సినిమాల్లో నటించను" అని హీరో చిరంజీవి బుధవారం స్పష్టంగా చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇక సినిమాల్లో నటించనని, ప్రజాసేవకే అంకితమని ఆయన అన్నారు. రెండు నెలల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మండల స్థాయి నుంచి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించనున్నట్లు తెలిపారు. గురువారం తిరుపతిలో అమలవుతున్న అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొంటామన్నారు.