చెన్నై: సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె నటి శ్రీదేవి పెళ్లి వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరసింహారావు, ఉమ దంపతుల కుమారుడు రాహుల్ తో గురువారం చెన్నైలో ఘనంగా ఈ వేడుక జరిగింది. ప్రముఖ నటులు కమలహాసన్, రజనీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, విక్రమ్, సత్యరాజ్, భాగ్యరాజ్, జయం రవి తదితరులు సతీసమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటీమణులు మీనా, రంభ, త్రిష, స్నేహ, సీనియర్ నటీమణులు షావుకారు జానకి, వాణిశ్రీ, శ్రీదేవి, మహేశ్వరి తదితరులు కూడా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.