భారత సంతతి యువకుడి కాల్చివేత
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన 26 ఏళ్ల భారత సంతతి యువకుడిని అమెరికాలో దోపిడీ దొంగలు కాల్చి చంపారు. ఇండియానా మెర్రివిల్లేలో గుర్జీత్ సింగ్ అనే యువకుడు తన అంకుల్ కు చెదిన గ్యాస్ స్టేషనులో పనిచేస్తున్నాడు. నలుగురు సాయుధ దోపిడీ దొంగలు ఈ నెల 14వ తేదీన గుర్జీత్ సింగ్ ను కాల్చి చంపారు.
ఈ సంఘటనపై కమ్యూనిటీ యాక్టివిస్టులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అర్థరహితమై ఈ హత్యను వారు ఖండించారు. ఈ సంఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని యుఎస్ఆసియన్ ప్రభుత్వ సంబంధాల డైరెక్టర్ డినో తెప్పారా అన్నారు. నలుగురు సాయుధుల్లో ఒకడు సింగ్ మెడపై కాల్చాడు. ఆ తర్వాత నలుగురు వెళ్లిపోయారు. నిఘా కెమెరాలో ఆ దృశ్యాల చిత్రీకరణ జరిగింది.












Click it and Unblock the Notifications