సోనియాతో వైయస్ భేటీ

వైయస్ రాజశేఖర రెడ్డి సోనియాను మర్యాదపూర్వకంగానే కలిశారని, ప్రత్యేకంగా చర్చ ఏదీ జరగలేదని వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల గురించి వైయస్ తమతో మాట్లాడారని ఆయన చెప్పారు. త్వరలో తాను హైదరాబాద్ వెళ్తానని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనను వాడుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఆరు సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కూడా ఆయన కేంద్రాన్ని కోరుతున్నారు.
గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రాజశేఖర రెడ్డి మరో రోజు ఢిల్లీలో ఉంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను ఆయన కలుసుకుంటారు. ఇప్పటికే ఆయన కొంత మంది కేంద్ర మంత్రులను కలిశారు. మరి కొంత మంది కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు.












Click it and Unblock the Notifications