తిరుమల : తిరుమలలో రద్దీ ఇంకా కొనసాగుతోంది.తిరుమల భక్తులతో నిండిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో దేవదేవుని దర్శనం కోసం వేలాదిమంది భక్తులు రావడంతో దివ్యారామం కిటకిటలాడుతోంది.భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకొని సెల్లార్ దర్శనాలను దేవస్థాన అధికార్లు రద్దు చేశారు.