ఇప్పుడేమీ చెప్పలేను: తలసాని

హైదరాబాద్: తాను కాంగ్రెసులో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలుగుదేశం తిరుగుబాటు నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. తాను వార్తలు చూశానని, ఇప్పుడేం చెప్పినా బాగుండదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అన్ని విషయాలను స్పష్టం చేస్తానని ఆయన చెప్పారు.

తాను ఈ రోజు 12 గంటలకు అన్ని విషయాలపై స్పష్టం ఇస్తానని ఆయన చెప్పారు. నిన్న ఏం జరిగిందనే విషయాలు కూడా చెప్తానని ఆయన చెప్పారు. తాను కాంగ్రెసు నాయకులను కలవడం సాధారణంగా జరిగిందేనని ఆయన అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారమని కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి అన్నారు. బేషరతుగా తమ పార్టీలోకి ఎవరైనా వస్తే తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+