ఎసిఎ స్వాధీనం: కోమటిరెడ్డి
హైదరాబాద్: వివాదంలో చిక్కుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆలోచన చేస్తోందని రాష్ట్ర క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి తమ శాఖ అధికారులతో తాను తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎసిఎను స్వాధీనం చేసుకోవడానికి గల సాధ్యాసాధ్యాలపై, న్యాయపరమైన చిక్కులపై పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎసిఎలో మహిళా క్రీడాకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరు తమను ఆందోళనకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. మహిళా క్రీడాకారులు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారని, దానిపై మంత్రి పోలీసు ఉన్నతాధికారి రతన్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications