హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ప్రయత్నాలు కొనసాగుతాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు.కాంగ్రెసుకు తామే ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. సిపిఎం రాష్ట్ర సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కీలకమైన విద్యా, బీమా, వైద్య రంగాల్లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో వైఫల్యంపై చర్చించడానికి, పార్టీని పటిష్టం చేయడానికి సిపిఎం రాష్ట్ర సమావేశం గురువారం ఇక్కడ జరుగుతోంది.