మమతపై ఆంధ్రా కాంగ్రెస్ అసంతృప్తి
న్యూఢిల్లీ: మమతా బెనర్జీ శుక్రవారం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మమతా బెనర్జీ వద్దకు వెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు మమతా బెనర్జీకి ఒక వినతిపత్రం సమర్పించారు. తాము కోరిన ఏ ఒక్కదాన్ని కూడా మమతా బెనర్జీ నెరవేర్చలేదని వారంటున్నారు.
రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి.హనుమంతరావు బహిరంగంగానే అంగీకరించారు. దీనిపై తదుపరి చర్యలు ఏం చేపట్టాలనే విషయంపై ఆంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆలోచిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులే ముఖ్యంగా మారారు. తాము అంత పెద్ద యెత్తున పార్లమెంటుకు వచ్చినప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతున్నామనే విమర్శను తిప్పికొట్టడానికైనా రైల్వే బడ్జెట్ విషయంలో ఆందోళనకు దిగాలని ఆలోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications