అన్నీ అబద్ధాలే: రామారావు
హైదరాబాద్: తనపై విద్యార్థినులు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. తమపై టీవీ రామారావు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు శనివారం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు విద్యార్థినులు కూడా ఆరు నెలల క్రితమే తమ కళాశాలలో చేరారని ఆయన చెప్పారు.
కొత్తగా కళాశాలలో చేరిన అమ్మాయిలు ఫీజులు కూడా చెల్లించలేదని, ఆదే విషయం అడిగానని, సెలవులు ముగిసి తిరిగి వచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తనపై కుట్రపూరితంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన నర్సింగ్ విద్యార్థినులకు సూచించారు.












Click it and Unblock the Notifications