తానా మహాసభలను ప్రారంభించిన గల్లా
షికాగో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) షికాగోలో నిర్వహిస్తున్న 17వ ద్వైవార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విందు సమావేశంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు, ప్రముఖుల ప్రసంగాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్రం నుంచి తరలివచ్చిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మేధావులు, సాహితీ మూర్తులు, ఆద్యాత్మికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, కళాకారులు వేడుకల్లో తళుక్కున మెరుస్తూన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి ప్రారంభమైన 'తానా' ద్వైవార్షిక మహాసభలు విందు సమావేశంతో మొదలయ్యాయి. మంత్రి గల్లా అరుణకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఈ వేడుకలకు ప్రధాన అతిథిగా విచ్చేసిన ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ క్విన్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రవాసాంధ్ర సంస్థలు చేస్తున్న కృషిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.












Click it and Unblock the Notifications