చైనాలో అశాంతి: 140 మంది మృతి
రుంఖీ:చైనాలోని జింజియాగ్ ప్రాంతంలో చెలరేగిన జాతిపరమైన అశాంతిలో 140 మంది మృతి చెందారు. దశాబ్దాలుగా ఇంతటి జాతిపరమైన అశాంతి చెలరేగలేదు. ఆదివారం మొదలైన ఈ ఘర్షణ సోమవారం కూడా చెలరేగింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి అశాంతిని ప్రజ్వరిలింపజేశారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికార వర్గాలంటున్నాయి.
ఈ ఘర్షణలో 800 మందికి పైగా గాయపడ్డారు.దీనికి సంబంధించి వందలాది మందిని అరెస్టు చేసినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ప్రజలు పోలీసుల కారుపై కూడా దాడి చేసారు. బస్సులకు, ఇతర వాహనాలకు నిప్పంటించారు.












Click it and Unblock the Notifications