భారత విద్యార్థుల కోసం వర్కింగ్ గ్రూప్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల రక్షణ కోసం వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని భారత్, ఆస్ట్రేలియాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఉరు దేశాల పరస్పర సహకారంతో ఈ వర్కింగ్ గ్రూప్ పని చేస్తుంది. ఆస్ట్రేలియా ఉన్నత స్థాయి బృందం, భారత ఓవర్సీస్ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇరు దేశాల్లోని విద్యా ఏజెంట్లను నియంత్రించడంపై తొలుత ఆ గ్రూప్ దృష్టి పెడుతుంది. వ్యవస్థలో ఈ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఓవర్సీస్ ఇండియన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కె.మోహన్ దాస్ చెప్పారు.












Click it and Unblock the Notifications