నన్ను షేక్ కు అమ్మజూపారు: ఫాతిమా
హైదరాబాద్: హైదరాబాదులోని సైదాబాద్‌లో నివాసం ఉంటున్న పాతిమా నయీమ్ అనే యువతి తన బంధువులు తనను దుబాయ్ షేక్ లకు అమ్మజూపారని ఆరోపించింది. బంధువుల చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి తనకు రక్షణ కల్పించాలంటూ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తాము కేసు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు. అమ్మాయికి అన్యాయం జరగకుండా చూస్తామని వారన్నారు.
ఫాతిమా నయీమ్ కు తల్లిదండ్రులు లేరు. ఆమె తన సన్నిహత బంధువుల ఇంట్లో ఉంటూ స్టాన్లీ గర్ల్స్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తన బంధువులు తనను దుబాయ్ షేక్ కు అమ్మజూపారని, దాంతో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించానని ఫాతిమా నయీమ్ మీడియాతో చెప్పింది. తనకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications