విద్యార్థి మృతితో అట్టుడికిన శ్రీనగర్

శ్రీనగర్: నిరసనలు హింసాత్మకంగా మారడంతో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సాధారణ జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి శవం పాత బస్తీ ప్రాంతంలో కనిపించడంతో నిరసనలు పెల్లుబికాయి. 20 ఏళ్ల ఆస్రార్ అహ్మద్ దర్ అనే విద్యార్థి శనివారం నాడు వైసుమా నుంచి అదృశ్యమయ్యాడు. అతని శవరం రైన్ పూరిలో కనిపించింది.

విద్య్రార్థిని పోలీసులు గానీ భద్రతా బలగాలు గానీ తీసికెళ్లి చంపేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మృతి వార్త తెలిసిన వెంటనే శ్రీనగర్ లో అల్లర్లు చెలరేగాయి. దుకాణాలపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు భద్రతా బలగాల వాహనాలకు నిప్పంటించారు. శ్రీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+