లాడెన్ అక్కడున్నాడు..
లండన్ : ఒసామా బిన్ లాడెన్‌తో సహా అల్‌ఖైదా నేతలందరూ ఆఫ్గన్‌లోనే ఉన్నారని పాక్ అంతర్గత మంత్రి రహమాన్ మాలిక్ అన్నారు. ''మేము ఇప్పటికే పాకిస్థాన్‌లో అల్‌కాయిదా నాయకుల కోసం మా దళాలతో తూర్పార పట్టాం. కాని వారి జాడ కానరాలేదు. అల్‌కాయిదా నాయకులు లాడెన్‌తో పాటు ఇతర అగ్రనేతలందరూ అఫ్ఘానిస్తాన్ నుంచే తమ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. వారు బహుశా కునార్ ప్రాంతంలో ఉండవచ్చు. అక్కడకు చేరుకునేందుకు మా దళాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి"" అని చెప్పారు. పాక్‌లోనే లాడెన్ ఉన్నాడని స్వాత్‌లోయలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో అధికంగా సాధారణ పౌరులు చనిపోతున్నారని మాలిక్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సండే టైమ్స్ ప్రతినిధి తెలిపారు.












Click it and Unblock the Notifications