హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను తీసుకుని వెళ్తున్న త్రివేణి పబ్లిక్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సరైన నిర్వహణ పద్ధతులు లేనందువల్ల స్కూలు బస్సులు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. రవాణా శాఖ అధికారులు ఆ బస్సుల ఫిట్ నెస్ కు చెక్ చేయవలసి ఉంది. కానీ అలా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.