హైదరాబాద్: మన రాజకీయ వ్యవస్థ మారితే భారతదేశం 2039 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ కానుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రస్తుత యువతరమే ఈ మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. "సంకీర్ణ యుగంలో భారత ప్రజాస్వామ్యం" అనే అంశంపై హైదరాబాద్‌లోని హిందీ విద్యాలయం నిర్వహించిన సదస్సులో జేపీ పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం రాకముందే ప్రపంచ జాతీయ ఆదాయంలో భారత్ 20శాతం ఉంటే...ఇపుడది కేవలం రెండుశాతమేనని ఆయన గుర్తుచేశారు.