సిఎం గ్రేటర్ పర్యటన మూడు రోజులు

అనంతరం బండ్లగూడ చేరుకున్న వైఎస్ అక్కడ రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సహభావన టౌన్ షిప్ పనులను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు నిర్మించతలపెట్టిన ఎల్ ఐజీ పనులను సీఎం ప్రారంభించారు. అక్కడ నుంచి చంద్రాయణగుట్ట చేరుకున్న వైఎస్ అక్కడ రూ.14 కోట్లతో నిర్మించతలపెట్టిన మైసారం నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. ఫలక్ నుమాలో ఉర్దూ మోడల్ స్కూల్ ను సీఎం ప్రారంభించారు. అలాగే పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications