మెదక్: ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సు మెదక్ జిల్లా రామాయంపేట వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘనలో ఒకరు మృతి చెందగా, సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే బోల్తా పడిన బస్సు కింద మరికొందరు ప్రయాణికులు ఉన్నారు. దాంతో బస్సును తొలగించి వీరిని రక్షించేందుకు క్రేన్ లు తెప్పిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం డ్రైవర్, కండక్టర్ పరారీలో ఉన్నారు.