తిరుపతి: వేసవి సెలవుల కారణంగా కిటకిటలాడిన తిరుమల ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. మహా లఘు దర్శనంను కొనసాగిస్తున్నారు. ఆలయంలో రేపు అనివార్య ఆస్థానం నిర్వహిస్తారు. దీంతో రేపు సుప్రబాత సేవ మినహా అన్ని అర్జిత సేవలను రద్దు చేశారు.