న్యూడిల్లీ: టీవీ ప్రసారాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు ఫిర్యాదుల అందిన నేపథ్యంలో మూడు ఛానెళ్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపటం జరిగిందని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. ఎంటీవీ, రియల్ టీవీతో పాటు వార్తా ఛానెల్ ఎన్డీటీవీ ఇండియాలకు నోటీసులు పంపినట్లు సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి మోహన్ జతువా మంగళవారం లోక్ సభలో పేర్కొన్నారు. 'సర్కార్ కీ దునియా" అనే టైటిల్‌తో అసభ్యకరమైన దృశ్యాలను ప్రసారం చేసిన రియల్‌టీవీ, ఎన్డీటీవీలకు నోటీసులు పంపామన్నారు.