కాళహస్తిలో కాటేసిన తేనెటీగలు
కాళహస్తి: తిరుపతికి సమీపంలోని కాళహస్తిలో గురువారం నాడు తేనెటీగలు దాడి చేయడంతో 20 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక పొన్నాలమ్మ గుడి వద్ద దర్శనం కోసం భక్తులు బారులు తీరి వున్న సమయంలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా భక్తులను కమ్ముకున్నాయి. తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి భక్తులు తలోదిక్కుకీ పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. భక్తులను తేనెటీగలు పావుగంట పాటు పరుగులు పెట్టించాయి.












Click it and Unblock the Notifications