కోటి ఇస్తా..రేప్ చేయించుకో!!

మాయవతిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రీటా బహుగుణ జోషిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. రీటాకు మొరాదాబాద్ కోర్టు తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చేందుకూ తిరస్కరించింది. మరోవైపు, జోషి ఇంటిపై బిఎస్పీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వ్యక్తుల దాడి చేసారు. బహిరంగ సభలో రీటా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మౌనం వహించారంటూ మాయావతి, సోనియాగాంధీపైనా మండిపడ్డారు.
అలాగే ఈ వ్యాఖ్యలు లోక్‌సభలో గందరగోళానికి దారితీయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతునిస్తున్న బిఎస్పీ మద్దతు ఉపసంహరణపై ఆలోచనలో పడే వరకూ వెళ్ళింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు మాయావతిని బాధపెట్టిఉంటే క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నా.. ఆమె హింసాత్మక చర్యలకు దిగుతున్నారని రీటా ఆరోపించారు. ఇదంతా తనమీద పన్నుతున్న కుట్రలో భాగమేనని విమర్శించారు. జిల్లా జైల్లో ఉన్న రీటాను మాజీ క్రికెటర్, మొరాదాబాద్ కాంగ్రెస్ ఎంపీ అజారుద్దీన్ పరామర్శించారు.












Click it and Unblock the Notifications