మెడిసిన్ సీటు దక్కని 9వ ర్యాంకర్
విజయవాడ: ఎంసెట్ మెడిసిన్ తొమ్మిదో ర్యాంకరుకు చేదు అనుభవం ఎదురైంది. తొమ్మిదో ర్యాంకర్ సాయిరాంకు సీటు కేటాయించడానికి అధికారులు నిరాకరించారు. ఎంసెట్ మెడిసిన్ కౌన్సెలింగ్ సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. వయస్సు సరిపోను లేదనే కారణంతో సాయిరాంకు అధికారులు సీటు నిరాకరించారు.
మెడిసిన్ లో సీటు కోసం 17 ఏళ్ల వయస్సు దాటాల్సి ఉంది. సాయిరాంకు ఆ వయస్సు లేదని అధికారులు చెప్పారు. వైద్య విద్యా మండలి (ఎంసిఎ) నిబంధనల వల్లనే తాము సాయిరాంకు సీటు ఇవ్వలేకపోయామని, ఇందులో తామేమీ చేయలేమని వారంటున్నారు. కాగా, ఆరో ర్యాంకర్ వర్ష గాంధీ వైద్య కళాశాలలో సీటు తీసుకుంది.












Click it and Unblock the Notifications