కాకినాడ అస్పత్రికి ఎమ్మెల్యే తరలింపు

నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో టీవీ రామారావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుండె నొప్పి వస్తుందని చెప్పడంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే రామారావుకు గుండెపోటు లేదని, రక్తంపోటు మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. దీంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రామారావు గుండెపోటు నాటకం ఆడుతున్నారని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో తేలికగా తీసుకుని రాజమండ్రి జైలుకు పంపారు. తాజాగా ఆయనకు గుండె నొప్పి రావడంతో ఏది నిజమనే విషయం తేలడం లేదు. రామారావుకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications